కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పించింది. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన అందించిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.