తిరుమల డిసెంబర్ నెల ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలు వెల్లడి
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి డిసెంబర్ నెల ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగప్రదక్షిణ, గదుల కోటా ఆన్‌లైన్ విడుదల షెడ్యూల్‌ను తితిదే ప్రకటించింది. ఈ నెల 19 నుంచి వివిధ తేదీల్లో ఎలక్ట్రానిక్ డిప్ మరియు టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.