బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం జాఫర్ గఢ్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, స్థానిక నేత యాస జితేందర్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన కార్యకర్తలకు కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.