ముంబైలో సాకినాకా చా మహారాజాకు భారీ షుగర్ ఫ్రీ మోదకం
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
ముంబైలో జరుగుతున్న గణేశ్ ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన సాకినాకా చా మహారాజాకు ప్రముఖ చెఫ్ హర్ష్ కేడియా ఆధ్వర్యంలో సుమారు 351 కిలోల బరువున్న భారీ షుగర్ ఫ్రీ మోదకాన్ని నైవేద్యంగా సమర్పించారు. డయాబెటిస్ మరియు ఆరోగ్య స్పృహ కలిగిన భక్తులు కూడా ప్రసాదాన్ని స్వీకరించేలా సుమారు నాలుగు అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ ప్రత్యేక మోదకం తయారీకి దాదాపు 20 గంటల సమయం పట్టింది. భారతీయ కోకోతో తయారైన చాక్లెట్ పొరను అద్దిన ఈ భారీ మోదకాన్ని పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.