మర్రిపాడులో ఉపాధ్యాయుడికి ఘన వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన విద్యార్థులు

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా సేవలందించిన ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్ భాష బదిలీపై నాగినేనిగుంటకు వెళ్లారు. ఆయన బోధన, క్రమశిక్షణపై గ్రామస్తులు, విద్యార్థులు ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మేళతాళాలతో ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఆయన వేసిన పునాది ఎప్పటికీ నిలిచిపోతుందని, ఆయన అందించిన సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు.