బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన రిమాండ్ నిరాకరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, ఇద్దరు ఎమ్మెల్సీలకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని దూషించడంతో పాటు పోలీసులపై దాడికి పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.