అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళిక: లక్ష కోట్లతో సీఆర్డీఏ కీలక నిర్ణయాలు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.1,00,912 కోట్ల భారీ అంచనా వ్యయంతో 141 మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేందుకు సీఆర్డీఏ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఇప్పటికే రూ.52,362 కోట్ల పనులు క్షేత్రస్థాయిలో వేగంగా జరుగుతుండగా, మిగిలిన ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా నదిపై రెండు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం, వరద నివారణ చర్యలు, రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.