హైదరాబాద్‌లో కలకలం: మాదాపూర్‌లో అక్రమంగా తలదాచుకున్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలు అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నివసిస్తున్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్ దేశస్తులను స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో అక్రమ వలసలు మరియు వీసా నిబంధనల ఉల్లంఘనలపై నిఘా వేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న మహిళల వద్ద పాస్‌పోర్టులు, చట్టబద్ధమైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పాటు, నేపాల్ మీదుగా రహస్యంగా నగరానికి చేరుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.