ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర రోడ్డు ప్రమాం ముగ్గురు కూలీల మృతి

రిపోర్టర్: రాము స్థలం: Gurugram

గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై శ్రీరామ్ చౌక్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పనుల నిమిత్తం ఇనుప రెయిలింగ్‌లు ఏర్పాటు చేస్తున్న కూలీలను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన బిజేంద్ర, రామ్‌కుమార్, పప్పు సింగ్‌గా గుర్తించగా, తీవ్రంగా గాయపడిన సతీశ్ చంద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ విద్యార్థి వేదాన్ ఖన్నా కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.