ఢిల్లీలో ఇండియా కూటమి మార్చ్: రాహుల్ గాంధీ ప్రకటనపై పోలీసుల ఆంక్షలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలో ఆదివారం రామ్లీలా మైదాన్ వైపు చేపట్టనున్న మార్చ్లో ప్రజలందరూ పాల్గొనాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అయితే ఈ మార్చ్కు తాము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కొత్త ఢిల్లీ ప్రాంతంలో సెక్షన్ 163 అమలులో ఉందని, అనుమతి లేని నిరసనలకు అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.