హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుపై సింగిల్ జడ్జి ఉత్తర్వుల స్టే పొడిగింపు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను ఉద్యోగం నుంచి తప్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టేను కొనసాగిస్తూ స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. మల్కాజిగిరి మండలం లోతుకుంట సర్వే నంబర్ల భూ వివాదంపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు లోతుకుంట భూముల స్టేటస్కో ఉత్తర్వులను ఎత్తివేస్తూ, తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు.