మా గ్యారెంటీ పథకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాపీ కొడుతున్నారు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కర్ణాటక

కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాపీ కొడుతున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ సంక్షేమ పథకాలు బ్లాక్‌బస్టర్ విజయవంతమయ్యాయని, అమెరికాలో ట్రంప్ ఇస్తున్న హామీలు ఇందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.