కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం: రాంప్రసాద్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రావులపల్లి రాంప్రసాద్ స్పష్టం చేశారు. చర్లలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా పాలన పేరిట సాగుతున్న కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.