ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల కౌంటింగ్ ముమ్మరం
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర స్థానాల కోసం ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ, ఐసా ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థులు పోటీపడ్డారు. కార్యదర్శి పదవికి ఏబీవీపీ తరఫున రియా చౌదరి, ఎన్ఎస్ యూఐ తరఫున నమ్రత చౌదరి బరిలో నిలవగా, లెక్కింపులో రియా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే అధ్యక్ష పదవికి ఐసా ఎస్ఎఫ్ఐ కూటమి తరఫున అనన్య రతురి పోటీలో ఉన్నారు.