సాంకేతిక పరిజ్ఞానంతో లాడ్జీలలో సీసీఎస్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. నేర నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక నిఘా!

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నగరంలోని వివిధ లాడ్జీలలో సీసీఎస్ పోలీసులు పాపిలాన్ డివైజ్ సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీల్లో బస చేస్తున్న వారి వివరాలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు. నేరస్తుల కదలికలను గుర్తించేందుకు ఈ తనిఖీలు దోహదపడతాయని, నిబంధనలు పాటించని వారిపై చర్యలుంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.