భారత్‌పై ఆంక్షలు తగదంటూ జేపీ మోర్గాన్ సీఈఓ హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా కఠిన చర్యలు లేదా టారిఫ్‌లు విధించవద్దని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డైమన్ హెచ్చరించారు. తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే ప్రపంచ చమురురంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత రిఫైనరీల అవసరాలను వాషింగ్టన్ అర్థం చేసుకుని, ఆంక్షలకు బదులు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన హితవు పలికారు.