కొండచిలువతో నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేసిన విశాఖ బృందం

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

విశాఖపట్నానికి చెందిన ఓ గ్రూప్ హైదరాబాద్ వినాయక నిమజ్జన వేడుకల్లో కొండచిలువను మెడలో వేసుకొని విన్యాసాలు చేసింది. ప్రదర్శనలో ప్రత్యేకత కోసమే ఈ విచిత్ర చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదు రోజుల పాటు శ్రమించి ఆ గ్రూప్‌ను ట్రాక్ చేసి చివరకు ఇండియన్ రాక్ పైథాన్‌ను రక్షించారు. ఈ వన్యప్రాణి ప్రదర్శనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.