తెలంగాణలో రాజకీయ వేడి: అమిత్ షా పర్యటనతో బీజేపీ దూకుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం రాజకీయ వ్యూహాలు రచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాష్ట్ర పార్టీ శ్రేణుల్ లో నూతనోత్సాహాన్ని నింపిందని రాజకీయ పరిశీలకులు తెలిపారు. త్వరలోనే మరికొంతమంది అగ్రనేతలు రాష్ట్రానికి రానుండటంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాషాయ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.