నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్: హైకోర్టు స్టేతో నిలిచిన పోరు

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలోని గూడూరు, కావలి, అల్లూరు మున్సిపాలిటీల ఎన్నికలు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 2021 నుంచి హైకోర్టు స్టే కొనసాగుతుండటంతో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించిన తాజా నోటిఫికేషన్ జాబితాలో ఈ మున్సిపాలిటీలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అప్పట్లో గ్రామాల విలీనంపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవ్వడం, కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం న్యాయస్థానం విచారణ ముగిసే వరకు ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది.