కుమారుడి మృతికి న్యాయం కోరుతూ తల్లి ఆత్మహత్యాయత్నం
రిపోర్టర్: శివ
స్థలం: ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కుమారుడి మృతికి న్యాయం జరగలేదని మనస్తాపంతో ఓ తల్లి పాఠశాల ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అనుమతులు లేకపోయినా తెరుచుకున్న శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ ముందు ఆమె గత పది రోజులుగా పోరాడుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.