పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా గాలి ఒత్తిడితో బైక్ ఇంజిన్ తయారు చేసిన మెకానిక్

రిపోర్టర్: రాము స్థలం: ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన యువ మెకానిక్ బాదల్ వర్మ పెట్రోల్, డీజిల్ లేదా బ్యాటరీ అవసరం లేకుండా కేవలం గాలి ఒత్తిడితో ఇంజిన్‌ను నడిపే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించి పాత స్కూటీ ఇంజిన్‌తో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఆయన, తన ఆవిష్కరణకు మరింత ఆర్థిక సహకారం అందితే పూర్తిస్థాయి వాహనాన్ని రూపొందించవచ్చని ఆశిస్తున్నారు.