ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాసరావు గెలుపు కోరుతూ యాదాద్రిలో జనసేన పూజలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయం కాంక్షిస్తూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు ఆముదాల పరమేశ్ ఆలయ అన్నదాన ట్రస్ట్కు లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.