సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై హౌతీల క్షిపణి దాడులు

రిపోర్టర్: నరేష్ స్థలం: వరల్డ్

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఇంధన నిల్వ కేంద్రంపై యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ బ్యాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఆరామ్‌కోకు చెందిన ఇంధన ట్యాంక్‌లో భారీ మంటలు చెలరేగగా, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. యెమెన్ రాజధాని సనాపై జరిగిన దాడులకు ప్రతిస్పందనే ఈ చర్య అని హౌతీలు ప్రకటించగా, సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు పలు క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు సంకీర్ణ దళాలు తెలిపాయి.