అమలాపురం ఆస్పత్రిలో దారుణం.. కుక్కకాటు గాయాలకు రిన్ సోప్!
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: అమలాపురం
కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. పిచ్చికుక్క దాడిలో గాయపడి చికిత్స కోసం వచ్చిన చిన్నారులకు, వైద్య సిబ్బంది రిన్ సోప్తో గాయాలను శుభ్రం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఈ భాగోతం బయటపడింది. వైద్యుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.