పెళ్లిళ్లలో ఆధునిక ఈవెంట్స్ సంస్కృతి మోయలేనంత భారంగా మారుతోంది

రిపోర్టర్: K J Kumar స్థలం: పాలకొండ

శుభాకార్యక్రమాలలో ముఖ్యంగా వివాహ వేడుకలలో ఈవెంట్స్ పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ సరికొత్త పోకడల వల్ల సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ అనవసరపు ఆర్భాటాలు కొత్త దంపతుల భవిష్యత్తును రోడ్డున పడేస్తున్నాయి. సమాజంలో మారుతున్న ఈ ప్రమాదకరమైన ధోరణి రాబోయే రోజుల్లో మన సాంప్రదాయాలను పూర్తిగా గంగలో కలిపేసేలా ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.