వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఘన నివాళులు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొని ఐలమ్మ పోరాట స్మృతులను ఘనంగా స్మరించుకున్నారు.