సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ అధిగమించాడు. సచిన్ 68 అర్ధశతకాల రికార్డును బ్రేక్ చేస్తూ జో రూట్ తన కెరీర్‌లో 69వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌సవీప్ చేసింది.