తాగునీటి ఎద్దడి నివారణకు రూ.120 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.120 కోట్లు విడుదల చేసిందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు సింగూరు తాగునీటి అవసరాలకు ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన జిల్లాలకు తక్షణ సహాయం కింద కోటి చొప్పున మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు మిల్లెట్ కేఫ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.