తీరంలో అర్నబ్ తుఫాన్ బీభత్సం: సముద్రంలో కలిసిపోయిన డెబ్బై ఇళ్లు

రిపోర్టర్: నరేష్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా కోనపాపపేటలో అర్నబ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించిందని స్థానిక అధికారులు తెలిపారు. సముద్రపు అలల ఉగ్రరూపానికి డెబ్బై ఇళ్లు నీట మునిగి సముద్రంలో కలిసిపోయాయి. వందలాది మత్స్యకార కుటుంబాలు సర్వస్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి. ఉప్పాడ ప్రధాన రహదారి సుమారు రెండు వందల మీటర్ల మేర పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.