'గాడిద దొంగలు, ఫోర్జరీ సన్నాసులు మాట్లాడుతున్నారు': కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
ఎన్నికల ముందు దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తోందని బీఆర్ఎస్ నేత తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన వారు కూడా నేడు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ నేతలను దూషించడమే కాంగ్రెస్ నాయకుల పనిగా పెట్టుకున్నారని, ప్రజలు మీ వైఫల్యాలను గమనిస్తున్నారని ఘాటుగా హెచ్చరించారు.