అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతున్న అల్లూరి మన్యం ఉత్పత్తులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజనులు పండిస్తున్న కాఫీ, మిరియాలు, రాజ్మా, పసుపు వంటి ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. సేంద్రియ పద్ధతిలో సాగవుతున్న ఈ పంటలకు దేశవిదేశాల్లో విపరీతమైన గిరాకీ లభిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరి రైతులు ఆధునిక పంటలను సాగు చేస్తూ కోట్లలో వ్యాపారం సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.