పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం: మహిళా జర్నలిస్ట్ పట్ల దురుసు ప్రవర్తన
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
మగ పోలీసులు ఇష్టానుసారంగా తాకుతూ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ స్వతంత్ర గ్రౌండ్ జర్నలిస్ట్ మరియు ఫ్యాక్ట్ చెకర్ తులసి చందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇదేం పద్ధతి అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును నిలదీశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుండగా ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చనీయమవుతోంది.