జేడీయూ బహిష్కరణపై మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: గోపి
స్థలం: Patna
జేడీయూ నుంచి తనను బహిష్కరించడంపై మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల తనకు ఎలాంటి విచారం లేదని, త్వరలోనే సొంతంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఇప్పుడు ఏమీ మిగల్లేదని, రాబోయే రోజుల్లో జేడీయూ కనీసం పది స్థానాలు కూడా గెలుచుకోలేదని అనంత్ సింగ్ మండిపడ్డారు.