ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: తమిళనాడు టెట్ ఫలితాలు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: Chennai

తమిళనాడులో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ఉపాధ్యాయ నియామక బోర్డు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన పరీక్షల తుది కీ ఆధారంగా ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా ఫలితాలను త్వరగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.