నా తల్లిని దూషించారు: సభనుంచి తప్పుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత వ్యాఖ్యలతో మనస్తాపం చెంది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నడిపించలేనంటూ తప్పుకున్నారు. తన తల్లిని కించపరిచేలా మాట్లాడారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. స్పీకర్ అభ్యర్థన మేరకు మధ్యాహ్న సెషన్‌ను ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి నిర్వహించారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై సభలో హరీష్ రావు, స్పీకర్ మధ్య వాగ్వాదం జరిగింది.