ఉద్యమకారుల అక్రమ అరెస్టులపై రేవంత్ సర్కార్పై భగ్గుమన్న బెల్లంపల్లి నేతలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

సీఎం నివాసం ముట్టడికి వెళ్తున్న తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బెల్లంపల్లి పట్టణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులతో పాటు పింఛన్లు, ఇళ్లు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని వారు కోరారు.