భార్యను గోడకేసి కొట్టి చంపిన భర్త: కనిమెరకలో దారుణం

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరకలో భార్య సంధ్యను భర్త రామముత్యాలరావు దారుణంగా హత్య చేశాడు. గొడవ నేపథ్యంలో భార్య ముక్కు, నోరు మూసి తలను గోడకేసి బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో నిందితుడిని అరెస్టు చేశారు.