తిరుమలలో నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: తిరుపతి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.