చిల్లకూరు మండలంలో యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా

రిపోర్టర్: రమేష్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని కడివేడు రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సుమారు రెండున్నర ఎకరాల్లో జరిపిన ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి రెండు యంత్రాలు, పదమూడు టిప్పర్లను స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. అధికారులకు అప్పగించిన వాహనాలు మరుసటి రోజే మాయమవడం అధికారుల తీరుపై విమర్శలకు తావిస్తోంది.