సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్'
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాపై యువతలో భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.