అడవుల పరిరక్షణకు జన్నారంలో సమరశంఖం పూరించిన అటవీశాఖ అధికారులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మనిషి మనుగడకు ఆధారం అడవులేనని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జన్నారం అటవీశాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని గోండు గూడ గ్రామంలో ఆదివాసులకు అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యంపై కళాకారులతో పాటల రూపంలో అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్యతకు, వర్షాపాతానికి అడవులు కారణమవుతాయని వాటిని సంరక్షించుకుందామని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాకారులు, స్థానిక ఆదివాసులు పాల్గొన్నారు.