తెలంగాణ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన కోమటిరెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులు, అనుమతులు మరియు నిధుల మంజూరుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. చింతన్ శివిర్ మొదటి రోజు ముగిసిన అనంతరం ఆయనను కలిసి చర్చించినట్లు చెప్పారు. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల కోసం విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.