భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనర్హతపై ఉత్కంఠ

రిపోర్టర్: మహేష్ స్థలం: భద్రాచలం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును టార్గెట్ చేశాయి. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీజేపీ లీగల్ సెల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.