గోపీచంద్ సినిమా అప్డేట్: అమ్మ కదిలి వచ్చే పాట విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

సంకల్ప్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక కీలక అప్డేట్ వెల్లడించారు. ఈ చిత్రంలోని అమ్మ కదిలి వచ్చే పాటను విడుదల చేసినట్లు వారు తెలిపారు. క్రీ.శ. 642 నాటి చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుర్గాదేవి నవధారా రూపాలను అద్భుతంగా ఆవిష్కరించినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని మేకర్స్ పేర్కొన్నారు.