ఓటరు జాబితా పరిశీలనలో తహశీల్దార్ గోలి రవికిరణ్ అప్రమత్తత
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామాన్ని శనివారం తహశీల్దార్ గోలి రవికిరణ్ సందర్శించారు. సర్వే రెండవ దశ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయన కాల్వపల్లిలోని ఓటరు జాబితాపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాకు సంబంధించిన నోటీసుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.