కేరళ అమృతపురి ఆశ్రమంలో మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక సందర్శన
రిపోర్టర్: రాము
స్థలం: కేరళ
కేరళలోని కొల్లం జిల్లా అమృతపురి ఆశ్రమాన్ని మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సందర్శించారు. ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆశ్రమంలో గడిపిన లోకేశ్, అక్కడి కాళీ ఆలయం, అమృత విశ్వవిద్యాపీఠం, ఆయుర్వేద కళాశాలలను పరిశీలించారు. ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు సంస్థ విశేషాలను వివరించారు. ఈ పర్యటన రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.