భక్తిశ్రద్ధలతో ఘనంగా రామాసిపల్లి మైసమ్మ బోనాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తలకొండపల్లి

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో రామాసిపల్లి మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలను గ్రామ ప్రజలు, భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ప్రతి గ్రామంలో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సోదరభావం పెంపొందించేలా ఇలాంటి పండుగలు ఎంతో ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.