పాల్వంచలో ఘనంగా ఉప్పుశెట్టి ఖాదర్ బాబు వర్ధంతి: నివాళులర్పించిన కూనంనేని సాంబశివరావు

రిపోర్టర్: నరేష్ స్థలం: పాల్వంచ

పేదల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఉప్పుశెట్టి ఖాదర్ బాబు ప్రజల గుండెల్ లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచలో నిర్వహించిన ఖాదర్ బాబు తొమ్మిదో వర్ధంతి వేడుకల్ లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖాదర్ బాబు స్మారక స్థూపం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో ఆయన చేసిన సేవలను నాయకులు ఘనంగా స్మరించుకున్నారు.