సామాజిక కార్యకర్త హత్య కేసులో నలుగురు నిందితులు సీబీఐ కస్టడీ

రిపోర్టర్: సతీష్ స్థలం: Mohali

సామాజిక కార్యకర్త పర్విందర్ సింగ్ ఝోటా హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఐదు రోజులు, మరొకరికి నాలుగు రోజుల కస్టడీని కోర్టు విధించింది. పంజాబ్లో సంచలనం సృష్టించిన ఈ హత్యపై కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు సీబీఐ దర్యాప్తును చేపట్టింది.