హైదరాబాద్లో కలకలం: హాస్టల్ ముసుగులో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్లోని బేగంపేటలో సంతాన సాఫల్య కేంద్రాలకు అండాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. ప్రకాష్ నగర్లోని నజ్రాన్ అపార్ట్మెంట్లో గరల్స్ హాస్టల్ ముసుగులో ఈ అసాధారణ కార్యకలాపాలు సాగుతున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరి యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, వైద్య నిబంధనలను ఉల్లంఘించి ఈ దందా నడుపుతున్న నెట్వర్క్పై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.